లోయలో పడిన భక్తుడు
కాపాడిన అగ్నిమాపక శాఖ
ప్రజాశక్తి - పుంగనూరు, చౌడేపల్లి:
బోయకొండ అమ్మవారి దర్శనానికి వెళ్లి బలి కోసం తీసుకెళ్లిన మేకపోతు తప్పించుకోవడంతో దాని కోసం వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలోపడ్డాడు. ఆవ్యక్తిని పుంగనూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. పుంగనూరు అగ్నిమాపకశాఖ అధికారి ఎన్.సుబ్బరాజు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన ఎన్.కుమార్ కుమారుడు ఎన్.గణేష్(19) వారి కుటుంబ సభ్యులతో కలిసి బోయకొండ గంగమ్మ దర్శనార్థం రావడం జరిగింది. బోయకొండ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి మేకపోతు బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఆసమయంలో మేకపోతు తప్పించుకుని బోయకొండపై భాగంకు వెళ్లిపోయినది. ఆమేకపోతును పట్టుకోవడానికి కొండపైకి వెళ్లిన గణేష్ ప్రమాదవశాత్తు లోయలోకి పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే చౌడేపల్లి ఎస్సై ఫోన్‌చేసి హైరెస్కూ వారు హాజరు కావాలని అగ్నిమాపక శాఖను కోరారు. దీంతో పుంగనూరు అగ్నిమాపక సిబ్బందితో బోయకొండ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు లోయలో పడిన ఎన్.గణేష్‌కాపాడడం జరిగింది. సిబ్బంది ఎన్ రాజశేఖర్, వి.కేశవ ఇద్దరూ ధైర్యసాహసలతో లోయలోకివెళ్లి ప్రాణాలతో అతన్ని బయటికి తీయడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో చౌడేపల్లి పోలీస్ శాఖ, బోయకొండ దేవాలయం సిబ్బంది పాల్గొన్నారు.










