
మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్ మౌలానా అహ్మద్
ప్రజాశక్తి - శ్రీకాకుళం:జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన 21 లోక్ అదాలత్ బెంచ్‌ల్లో 9,255 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ మౌలానా అహ్మద్ తెలిపారు. ఈ అదాలత్‌లలో 4,84,09,661 మంది కక్షిదారులు భాగస్వాములై లబ్ధి పొందారని చెప్పారు. పరిష్కారమైన 9255 కేసుల్లో క్రిమినల్ కేసులు 9005, ప్రి లిటిగేషన్ కేసులు 108, సివిల్ కేసులు 142 ఉన్నాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఆరు అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ అదాలత్‌లో జడ్జి ఎస్‌ఎం ఫణికుమార్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆర్.సన్యాసినాయుడు, సీనియర్ సివిల్ జడ్జి అనురాధ, మెజిస్ట్రేట్‌లు శారదాంబ, భరణి, విద్య పాల్గొన్నారు.