- జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్
ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం(చిత్తూరు) : కేంద్ర రంగ సంస్థ అయిన డిఆర్డిఓకు భూ సేకరణ పూర్తి చేసి అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. బుధవారం నాడు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఇతర అధికారులతో కలిసి ఎస్ఆర్ పురం మండలంలోని చిత్తూరు తచురు రహదారిపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రేణుక ను ఉద్దేశించి ఈ జాతీయ రహదారి నుంచి డి ఆర్ డి ఓ కు, పుల్లూరు నుంచి మరో రహదారి డి ఆర్ డి ఓ కు కావాల్సిన స్థలమును వెంటనే సేకరించాలని ఆదేశించారు. వీలైనంత తొందరలో భూ సేకరణ పూర్తి చేసి అప్పగిస్తే వారు రోడ్లు ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందని అదేవిధంగా జాతీయ రహదారికి సంబంధించి కనెక్టివిటీ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాలు శాఖ అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ ఈ చంద్రశేఖర్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ దయానందం, జాతీయ రహదారుల పిడి ప్రశాంత్ డిఆర్డిఓ ప్రాజెక్ట్ మేనేజర్ తదితర అధికారులు పాల్గొన్నారు.










