లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ హౌసింగ్ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కమిషనర్ హౌసింగ్ అధికారులు, అమినిటీ కార్యదర్శులతో నగరపాలక కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న పన్నుల మేరకు స్టేజ్ కన్వర్షన్ సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వార్డుల వారీగా వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలపై సమీక్షించారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించి, అర్హులైన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ఇండ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.










