Sep 21,2022 21:14

లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూలు చేయాలి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ :
నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆస్తిపన్ను వసూళ్లు చేపట్టాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ నగరపాలక రెవెన్యూ అధికారులు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై ఆర్‌ఐలు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదని, ఈవిషయంలో రెవెన్యూ అధికారులు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శులు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతివార్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారుల జాబితాను సిద్ధంచేసి ఆమేరకు వసూలు చేపట్టాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్నులపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. పన్నుల వసూళ్లకు సంబంధించి రోజూ, వారాంతపు లక్ష్యాలను నిర్దేశించుకుని వసూళ్లు చేయడానికి కషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఆర్‌ఐలు, వార్డు అడ్మిన్‌ కార్యదర్శులు పాల్గొన్నారు.