ప్రజాశక్తి-అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్‌లో గంగాగౌరీ థియేటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ-9 తాడిపత్రి ధమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ 5వ బ్రాంచిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయనతోపాటు తాడిపత్రి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి జెసి అస్మిత్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్‌రెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండాపురం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజల ఆదరణతో లక్కీ-9 తాడిపత్రి ధమ్ ఫ్యామిలీ బిర్యానీ రెస్టారెంట్ అంచలంచలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇందులో భాగంగానే 5వ బ్రాంచిని అనంతపురం నగర నడిబొడ్డున ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. రాయలసీమ స్థాయిలో సుమారుగా పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్కడా లేని విధంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 360 మంది కూర్చునే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెస్టారెంట్‌లో అత్యాధునిక హంగులతో ఫ్యామిలీ లాంజ్, ప్యూర్ వెజ్ లాంజ్ కాంటినెంటల్ లాంజ్ విఐపి లాంజ్ ప్రత్యేక విభాగాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వందమంది కూర్చునే విధంగా ఆధునిక సౌకర్యాలతో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 99 వెరైటీ బిర్యానీలను అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో కూడా రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ పూర్తి పర్యవేక్షణలో 9 రెస్టారెంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రెస్టారెంట్‌ను పరిశీలిస్తున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్‌రెడ్డి










