Oct 13,2023 22:21

ఫొటో : లేగదూడలను ప్రదర్శిస్తున్న వైద్యులు

లేగదూడల ప్రదర్శన
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక పశువైద్యశాల ప్రాంగణంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం ఎపి పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి విజరుకుమార్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేగ దూడలను సంరక్షించుకొని మేలు జాతి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా జాతీయ కృత్రిమ గర్భధార కార్యక్రమం ద్వారా రైతులు మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం లేక దూడల పెంపకం చేపట్టి తమ ఆదాయ అభివృద్ధితో జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అయితే ఇంటి వద్దకే వైద్యం అందిస్తుందో పశువులకు కూడా అదేస్థాయిలో ఇంటి వద్దకే పశువులకు వైద్యసేవలు అందిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు సంచార పశువైద్య వాహనాలు ఏర్పాటు చేసి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఈ లేగ దూడల ప్రదర్శనలో మొదటి బహుమతిగా ఎర్ర గంగులు సుబ్బులు, ముప్పల వెంకటేశ్వర్లు, మూడో బహుమతి గంగినేని రమణయ్యలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పశువర్థకశాఖ ఎడిఎ గురు జయంతి, పశువర్థక శాఖ సహాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.