ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని, జగనన్న కాలనీల్లో ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యాన టిడ్కో ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుతోపాటు నేతలు పుట్టా వేణుగోపాలచౌదరి, కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు బ్యాంకు అప్పుతో సంబంధం లేకుండా ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ నిర్మించిన ఇళ్లను సైతం అప్పగించకపోవడం దారుణమన్నారు. టిడ్కో ఇళ్లను వెంటనే అప్పగించాలని కోరుతూ ఈ నెల 27న సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు. జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి కనీసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు, చిటికిన రాము, జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, గొర్రెల సతీష్, నరమాల కృష్ణ, మేట్రేటి రమణ, నర్మాల నారాయణరావు, కుంచంగి నానాజీ, ఏపూరి శ్రీను, కె.కొండలరావు, అయినాల ధర్మారావు పాల్గొన్నారు.










