ప్రజాశక్తి-గుత్తి వైఎస్సార్ బీమా పథకం కింద మంజూరైన తక్షణ ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు కౌన్సిలర్ వరదరాజులు శనివారం పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో దండు పద్మావతి, పి.వన్నూరప్పలు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి చొరవతో కౌన్సిలర్ వరదరాజులు రెండు కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా పథకం మంజూరు చేయించారు. పథకం కింద తక్షణ సాయం రూ.10 వేలు చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. బీమా సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమవుతుందని కౌన్సిలర్ చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు కెఎం. రంగనాయకులు, భాస్కర్ బాబు, వైసిపి నాయకులు లాల్‌రెడ్డి, స్టోర్ మస్తాన్, అరుణ్, లింగారెడ్డి, దేవేంద్ర, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు సుమలత, గంగాధర్, ఉద్యోగులు అలీ అక్బర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.










