May 25,2023 16:44
  • కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ

ప్రజాశక్తి-మడకశిర రూరల్ : అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ   డిమాండ్ చేశారు. ఈ మేరకు మడకశిర పట్టణంలో తాహిసిల్దర్ కార్యాలయం వద్ద గురువారం తాహాసిల్దార్ బాల ఆంజనేయులకు వినతి పత్రాన్ని కెవిపిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కెపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ మడకశిర ప్రాంతంలో దాదాపు 20,000 మందికి పైగా దళితులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కనీసం సమావేశాలు వివాహ వేడుకలు జరుపుకోవడానికి ఒక కమ్యూనిటీ భవనం లేకపోవడం చోద్యం అని పట్టణంలో పలు సర్కిల్లలో ఇప్పటివరకు సులభ కాంప్లెక్స్ లో బస్సు సెంటర్లు నిర్మించకపోవడం తొ మహిళలు ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి సమస్యలు పరిష్కరించాలనిఈ సందర్భంగా వారు కోరారు,
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు అంజప్ప, కెపిహెచ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా నాయకులు శివప్ప, ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు ఎల్లోటి రామంజి, తాలూకా ప్రధాన కార్యదర్శి అంజి, మండల అధ్యక్షుడు చంద్ పాల్గొన్నారు.