Jul 28,2022 15:49

ప్రజాశక్తి-చిత్తూరు : ఈరోజు ఏపీ మోడల్ స్కూల్ కమ్మనపల్లి బైరెడ్డిపల్లిలో ప్రిన్సిపల్ టి.ఎస్.అనిత మరియు పాఠశాల  చైర్మన్ పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి గురువారం స్కౌట్స్ ఆరంభించినారు. దాంట్లో పిల్లలకి కావలసిన  స్కౌట్ యూనిఫామ్, బెల్ట్, ప్యాంటు, షర్ట్స్, స్కార్ఫ్, ఇంకా  కావలసినవన్నీ కూడా వారికి ఎవ్వడం జరిగినది.  లీటర్ షిప్ క్వాలిటీస్ ని మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు. స్కౌట్స్ గా పిల్లలు బాగా ఎదిగి దీని వల్ల విద్యార్థులుకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూనివర్సిటీస్ లో రిజర్వేషన్ ఒకేషనల్  కాలేజెస్ లో 0.5% రిజర్వేషన్ అని కూడా  మేడం  విద్యార్థులకు తెలియజేశారు. దాంతోపాటు ఇక్కడ స్కౌట్స్ మాస్టర్ మోహన్  కూడా ఈ స్కౌట్స్ ని విద్యార్థులకుక బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఉత్సాహపరిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రిన్సిపల్ అనిత, స్కౌట్  ఉపాధ్యాయులు ఎస్ మోహన్. పాఠశాల చైర్ పర్సన్ శ్రీలత మరియు కమిటీ మెంబర్ శివ కుమార్ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.