Jul 23,2023 15:59

ప్రజాశక్తి-పాలకొల్లు : ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ 74వ జయంతి పాలకొల్లు మారుతి సినిమా ధియేటర్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షుడు కె.వి.కృష్ణ వర్మ మాట్లాడుతూ వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ లలిత కళాంజలి నాటక అకాడమీ అనే నాటిక సంస్థను స్థాపించి 33 సంవత్సరాలు జాతీయ నాటిక పోటీలు నిర్వహించారని చెప్పారు .అదే స్పూర్తితో పాలకొల్లు కళాపరిషత్ స్థాపించి 14 సంవత్సరాలుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మేడికొండ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, కొణిజేటి గుప్త, విన్నకోట వెంకట రమణ, కోడి రామకృష్ణ బాల్య మిత్రుడు కొయ్యాన సూర్యనారాయణ, మారుతి ధియేటర్ మేనేజర్ దేవళ్ళ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.