Oct 24,2023 21:26


ప్రజాశక్తి -యాదమరి రాష్ట్రస్థాయి 42 వ(13 జిల్లాలు)బాలబాలికల జూనియర్‌ ఖో ఖో పోటీలు చిత్తూరు జిల్లా ,పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రం హైస్కూల్‌ మైదానంలో జరిగాయి. బాలికల మొదటి స్థానం తూర్పు గోదావరి జట్టు కి, రెండవ స్థానం ప్రకాశం జట్టుకి ట్రోఫీ లో గెలుపొందారు. గెలుపొందిన ఇరు జట్లకు పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం ఎస్‌ బాబు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎమ్‌ అర్‌ గ్రూప్‌ సంస్థల అధినేత మోహన్‌ రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనంజయ రెడ్డి ,ఎంపిపి సురేశ్‌ బాబు, చిత్తూరు సాఫ్ట్‌ టౌన్‌ నల్లబోతుల ప్రవీణ్‌, వైస్‌ ఎంపీపీ రవి, యాదమరి సర్పంచ్‌ జాన్సీ పయని , జిల్లా కార్యదర్శి మనోహర్‌ రెడ్డి, వైస్సార్‌ కార్యదర్శి , వైఎస్సార్‌ పార్టీ యూత్‌ కన్వీనర్‌ కార్తిక్‌ జిల్లా ఖో ఖో సంఘ అధ్యక్షులు ప్రవీణ్‌, కార్యదర్శి శరత్‌ కుమార్‌, ప్రజాప్రతినిధులు నిర్వాహక కార్యదర్శి సురేష్‌ విక్రమ్‌ పాల్గొన్నారు.