Mar 17,2022 22:19

మాట్లాడుతున్న సూర్యారావు


ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
తిరుపతిలో గురువారం డివైఎఫ్‌ఐ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం.సూర్యారావు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వపరిశ్రమలు అమ్మేయడం, మూసేయడం, కొత్త పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిందన్నారు. కేంద్రం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని, పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోనూ 2.35 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. మూడేళ్లుగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం జాబ్‌చార్ట్‌ పేరుతో మోసం చేస్తోందన్నారు. చివరికి శాంతియుత ధర్నాలకూ అనుమతి ఇవ్వకుండా నిర్బంధిస్తోందన్నారు. నిర్బంధంతో అరెస్టులు చేయగలరు గానీ, నిరుద్యోగుల ఆవేదన తీర్చలేరన్నారు. ఖాళీలు భర్తీ చేయాలని శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఉద్యోగ పోరాట సమితి పిలుపునిచ్చిందన్నారు. దీన్ని జయప్రదం చేయాలన్నారు. పే అండ్‌ ప్లే పేరుతో క్రీడలను వ్యాపారం చేసి పేద క్రీడాకారులను స్టేడియంలకు, క్రీడలకు దూరం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.జయచంద్ర, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నరేంద్ర, నగర కార్యదర్శి సుమన్‌, మురళి, చైతన్య, విజ్నేష్‌, చరణ్‌, అజరుకుమార్‌ పాల్గొన్నారు.