Apr 04,2023 21:12

ప్రజాశక్తి - పోడూరు
కవిటం గ్రామంలో లాకుల వద్ద అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని శాసనమండలి ఛైౖర్మన్‌ కొయ్యే మోసేనురాజు, ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అన్నారు. ఆయన మార్గం అందరికీ ఆచరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గుంటూరి పెద్దిరాజు, మార్కెట్‌ యార్డు ఛైౖర్మన్‌ చికిలే లావణ్య, ఎంపిపి శబ్బితి సుమంగళి పాల్గొన్నారు