ప్రజాశక్తి-అనంతపురం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బెదిరేది లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తప్పకుండా వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని 14వ డివిజన్‌లో కార్పొరేటర్ అబూసాలెహా, మేయర్ మొహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి గడప గడపకూు మన ప్రభుత్వం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.600 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి నాయకులు అమరావతి కథలు చెప్పుకుంటూ కాలయాపన చేశారని విమర్శించారు. ఆ ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి చేయకపోవడం వల్లే ప్రజలు వైసిపిని ఆదరించారన్నారు. ప్రస్తుతం కూడా ప్రజలు జగన్ నాయకత్వం వైపు ఉన్నారన్నారు. గ్రహించే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ ఛైర్‌పర్సన్ మంజుల, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు గౌస్‌బేస్, శ్రీనివాసులు, భూమిరెడ్డి జాహ్నవి, వక్ఫ్‌బోర్డు జిల్లా ఛైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, వైసిపి నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, జెసిఎస్ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లక్ష్మన్న, వైసిపి బీసీ విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ రమేష్‌గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎగ్గుల శ్రీనివాసులు, యువజన విభాగం నగర అధ్యక్షుడు వాసగిరి నాగ్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మురుగునీటి కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి










