Mar 16,2023 21:07

ప్రజాశక్తి - పాలకోడేరు
ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలకోడేరు పిహెచ్‌సి వైద్యురాలు డాక్టర్‌ స్వర్ణ నిరంజని అన్నారు. కుముదువల్లిలో పిహెచ్‌సి డ్రాయింగ్‌ అధికారి డాక్టర్‌ రంగం నాయుడు సూచనల మేరకు 104 సిబ్బంది సహాయంతో, పాలకోడేరు పిహెచ్‌సి సిబ్బందితో గురువారం ఫ్యామిలీ ఫిజీషియన్‌ను నిర్వహించారు. అనంతరం గర్భిణులు, బాలింతలను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు నాగమణి, అయ్యప్ప శ్రీనివాస్‌, ఎంఎల్‌హెచ్‌పిలు మహాలక్ష్మి, వల్లి, ఎఎన్‌ఎం హేమలత, హెల్త్‌ అసిస్టెంట్‌ ఎం.విజయప్రసాద్‌, 104 సిబ్బంది పాల్గొన్నారు.