కూలీ బిడ్డ కలెక్టర్లు కావాలనేది జగనన్న లక్ష్యం
-డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రజాశక్తి -కార్వేటినగరం: కూలి బిడ్డ కూడా కలెక్టర్లు కావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యాక్రమానికి ముఖ్య అతిథతిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుం దన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలు అందించడమే కాకుండా, యూనిఫామ్‌తో ఇతర సామగ్రి పంపిణీ చేసి ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని అందించడానికి కషి చేస్తున్న వ్యక్తి జగనన్న అని గుర్తు చేశారు. ఎంతటి గొప్పవారై ఆర్థిక నేరానికి పాల్పడితే జైలు శిక్ష తప్పదన్నారు. చంద్రబాబు. స్కిల్ స్కాం చేసి జైలుకు వెళ్లితే దత్తపుత్రుడు. ప్రజా ధనాన్ని దోచేసి గజ దొంగగా జైలు ఊచలు ఎంచుతున్న చంద్రబాబును సాక్షాధారాలతో అరెస్టు చేస్తే రాజకీయం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అనంతరం 201 మందికి నూతన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతబాలాజీ, సర్పంచ్ ధనంజయవర్మ, ఉప సర్పంచ్ శేషాద్రి,మండల పార్టీ కన్వీనర్ శేఖర్రాజు, లబ్దిదారులు పలువురు పాల్గొన్నారు.










