Mar 01,2022 21:29

వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ వి.వసంతి

ప్రజాశక్తి -పాలసముద్రం: క్షయ వ్యాధి ప్రాణాంతకం కాదని, బాధితులు అప్రమత్తంగా ఉండి వైద్యం చేయించుకుంటే త్వరగా నయం చేసుకోవచ్చని వైద్యాధికారి వసంతి తెలిపారు మంగళవారం పాలసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి ఆమె క్షయ వ్యాధి నివారణపై అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, గళ్ళ, జ్వరం, బరువు తగ్గుట, ఆకలి లేకపోవటం, ఉమ్మిలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా గళ్ళ పరీక్షలు చేస్తారని తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల సరిపడే మందులు వాడుకుంటే వ్యాధులు నయం కావచ్చునని తెలిపారు. అందువలన ఆరోగ్య ఇబ్బందులు గ్రామాల్లో వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ జ్ఞానశేఖర్‌, సూపర్‌వైజర్‌ మురళి, సుశీల, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.