Oct 18,2023 22:01

మాట్లాడుతున్న ప్రకాశరావు

* డివిఇఒ ప్రకాశరావు
నరసన్నపేట:
కష్టపడి పనిచేసే వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని ఇంటర్మీడియట్‌ డివిఇఒ కోట ప్రకాశరావు అన్నారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పూర్వ విద్యార్ధిగా తానెప్పుడూ గర్వపడుతుంటానని అన్నారు. ఇటీవల రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు పొందిన ప్రకాశరావుకు కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణస్వామి అధ్యక్షతన సిబ్బంది బుధవారం ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులందరూ తమ గ్రామాల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోందని వివరించారు. కష్టపడి చదివి అత్యున్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. తమ కళాశాల నుంచి బైసిపి చదివిన విద్యార్థికి 981 మార్కులు రావడం ద్వారా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించ గలిగామని గుర్తు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ, వదనగిరి, అప్పన్న, శాంతారావు, డాక్టర్‌ మల్లేశు సోమశేఖర్‌, ఆనందరావు, రాంప్రసాద్‌, లక్ష్మీనారాయణ, హరిప్రసాద్‌, కృష్ణవేణి, రూపవతి, ఈశ్వరరావు, రవి, సురేష్‌, కూన హరిప్రసాద్‌, స్వర్ణ, నరేష్‌, అరుణ, రోజా, మీనాక్షి పాల్గొన్నారు.