మాట్లాడుతన్న రైతు సంఘాల నాయకులు
కష్ణా జలాల పంపిణీపై పునః సమీక్ష చేయాలి
-రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-నెల్లూరు:కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం పునః సమీక్ష చేయాలని, ప్రధాని నరేంద్రమోడీ తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని రైతు సంఘ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం సీనియిర్ నాయకుడు చండ్రా రాజగోపాల్ మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికలు దష్టిలో పెట్టుకొని, అక్కడ లబ్దిపొందేందుకు కేంద్ర ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తీసుకొచ్చి జిఓను రద్దు చేయించాలన్నారు. రైతాంగానికి అన్యాయం జరిగే విధంగా ఉన్న ఈ జిఓను కేంద్ర ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తామన్నారు. మిగులు జలాలతో సహా కష్ణా నీటి పంపకం బ్రిజేష్ కుమార్ కమిటీ ఇప్పటికే చేసి ఉందన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంతో సంప్రదించ కుండా కష్ణా జలాల పునః పంపిణీ కి కేంద్రం క్రొత్త ట్రిబ్యునల్ వేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుతుందని, ముఖ్యంగా జిల్లాకు భారీగా నష్టం చేకూరుతుందన్నారు. ప్రతి సంవత్సరం కష్ణా జలాలను సోమశిల ప్రాజెక్టుకు విడుదల చేయడం ద్వారా జిల్లా రైతాంగానికి లాభం చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పులిగండ్ల శ్రీరాములు, మూ లి వెంగయ్యలు పాల్గొన్నారు.










