అనంతపురం : జనసేన పార్టీ రోజురోజుకూ జనంలో బలపడుతున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుందుకు కృషి చేయాలని ఆపార్టీ ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షులు టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల పార్టీ విస్తృస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపితో కలిసి ఐక్య కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కాగా అధికార వైసిపి అభద్రతా భావం, ఓటమి భయంతో పెట్టే కేసులకు జనసైనికులు భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, నాయకులు భవాని రవికుమార్, పొదిలి బాబురావు, పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, జయరామ్‌రెడ్డి, ఈశ్వరయ్య, పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, అబ్దుల్, రాపా ధనుంజరు, సంజీవరాయుడు, మణికంఠ, గౌతమ్, కిరణ్‌కుమార్, సురేష్, ఆనంద్, సిద్ధు, జయమ్మ, అవుకు విజయకుమార్, పురుషోత్తంరెడ్డి, చంద్రశేఖర్, నారాయణస్వామి, ముప్పూరి కృష్ణ, కృష్ణమూర్తి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీనాయకులు










