Nov 01,2023 01:04

సాతులూరులో మాట్లాడుతున్న వై.రాధాకృష్ణ

నాదెండ్ల : ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర ను జయప్రదం చేయా లని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. రాధాకృష్ణ మంగళవారం పిలుపు నిచ్చారు. నవంబర్‌ 8 వ తేదీ ఉదయం 9 గంటలకు చిలక లూరిపేట కళామందిర్‌ సెంటర్‌ లో బహిరంగసభ జరుగుతుంది. మంగళ వారం నాదెండ్ల,తూబాడు , గొరిజ వోలు, సంక్రాంతిపాడు, చిరుమామిళ్ల, చంద వరం, సాతులూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ , పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజాసమస్య లే ప్రధాన ఎజండాగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం 30 అంశాలతో ప్రజా ప్రణాళిక ను రూపొందించడం జరిగినట్లు చెప్పారు. ప్రణాళిక అమలు కోసం ప్రజలను సమీ కరించి పోరాటం నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలుచేకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యా యం చేసిందని, విద్యుత్‌ సం స్కరణల ను తీసుకొచ్చి వినియోగ దారుల పై చార్జీల బారాన్ని పెంచిందని విమర్శించారు.. స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల గురించి ప్రస్తావించారు. కరువు నివారణ చర్యలు తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని అనానరు. ఎన్‌డి కూటమికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు పోరాడు తుంటే మనరాష్ట్రంలోని అధికార వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి వంతపాడుతూ రాష్ట్ర ప్రయోజ నాలను దెబ్బతీస్తున్నాయని విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం ద్వారానే తిప్పి కొట్టగలమని అన్నారు.మతోన్మాదానికి , కార్పోరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరా టాలలో సిపిఎం ముందుండి పోరాడు తుందని, ఆ పోరాటాలలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రచార యాత్ర లో సిపిఎం నాయకులు తోకల కోటేశ్వరరావు , పేరుబోయిన వెంక టేశ్వర్లు , జరుగుల శంకరరావు , ఆలోకం సుబ్బారావు, కారుచోల రోశయ్య, విల్సన్‌ , పి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.  నకరికల్లు: నిత్యావసర ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా సిపిఎం నాయకురాలు డి.శివకుమారి అన్నారు. మండలంలోని దేచవరంలో మంగళవారం ప్రజా రక్షణ భేరి ప్రచార యాత్ర రెండో రోజు కొనసాగింది. సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చ గొడుతోందని, దేశ ప్రజల సహజ సంప దను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడు తోందని అన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్‌ రెడ్డి, మండల కార్యదర్శి గాడిద మల్ల పిచ్చా రావు, ఈ ఊరి లక్ష్మారెడ్డి, గుంజి ఏడుకొండలు, ఆవుల వెంకటేశ్వర్లు, ఎస్‌ రామాంజి నాయక్‌, చట్టు కోటేశ్వర రావు, గోదా వెంకటరమణ పాల్గొన్నారు.