
నిరసన తెలుపుతున్న రైతులు
నందిగాం : నందిగామ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలన సాంబమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలోని కనితూరులో రైతులతో కలసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామ మండలం పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుందని అన్నారు. సకాలంలో సాగునీరు అందక ఇప్పటికే అనేక పంట పొలాలు బీడు భూములుగా మారాయన్నారు. తక్షణమే నందిగాం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు. అనంతరం తహశీల్దార్ వై.వి.పద్మావతిని కలసి వినతిపత్రం అందజేశారు.