Sep 01,2022 21:58

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం
ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌పురం:
మండలంలోని ఎస్‌ఆర్‌పురం గ్రామపంచాయతీ యుయంపురం గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి స్థానిక సర్పంచ్‌ హరిత కుప్పయ్య ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ విజయానంద రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు చాలామంది ఉన్నారని, వారి క్రీడ అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహం, పెంపొందిస్తుందని అన్నారు. ఈకార్యక్రమానికి జెడ్పిటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్సిపి మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి గురువారెడ్డి, నాయకులు జనార్ధన్‌, మణీ, కుప్పయ్య, రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి కాలప్ప, కాపుసంఘ అధ్యక్షులు కొత్తపల్లి సర్పంచ్‌ డివి డిల్లయ్య, మాజీ సర్పంచ్‌ విజయబాబు, దామునాయుడు, శ్రీధర్‌, మురళి, హరినాధ రెడ్డి, జయరాజ్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.