Sep 29,2022 21:57

క్రీడలతోనే మానసిక ఉల్లాసం.. డిప్యూటీ సీఎం
ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం:
మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గురువారం ఎస్‌ఆర్‌పురం మండలం తయ్యూరు పంచాయతీ చిన్నతయ్యురు గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. క్రికెట్‌ టోర్నమెంట్‌ని ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి డిప్యూటీ సీఎం సరదాగా క్రికెట్‌ ఆడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రీడాభివద్ధికి ఎక్కువ నిధులు కేటాయించిందని, గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు. అలాగే క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం ఉంటుందని తెలిపారు. అనంతరం క్రీడా మైదానం కోసం స్థలం సేకరించాలని తహశీల్దార్‌ని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానంద రెడ్డి, జడ్పిటిసి రమణ ప్రసాద్‌ రెడ్డి, ఎంపీపీ సరిత, స్థానిక సర్పంచ్‌ వరదమ్మ, డిసిసిబి జిల్లా డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యం, మాజీ జెడ్పిటిసి గురువారెడ్డి, మండల కన్వీనర్‌ మణి నాయకులు కాపు సంఘం అధ్యక్షుడు విజయబాబు, జనార్ధన్‌, మాజీ సర్పంచ్‌ బాబు పాల్గొన్నారు.