ప్రజాశక్తి-ఆత్మకూరు క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం లభిస్తుందని ఎస్‌ఐ జనార్ధన్ సూచించారు. మండల కేందంలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆత్మకూరు-నార్పల జట్లు తలపడగా ఆత్మకూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 14 ఓవర్లకు 89 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు కేవలం 14 ఓవర్లకు 82 ఆలౌట్ అయింది. దీంతో విజేత ఆత్మకూరు జట్టుకు రూ.లక్ష బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ క్రీడాకారుల్లో క్రీడల ద్వారా నైపుణ్యం పెరగడంతోపాటు మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. గెలిచినప్పుడు పొంగిపోయి, ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదన్నారు. కాగా వెంకటరామిరెడ్డి జ్ఞాపకార్థం సద్దికూటి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సద్దికూటి సూర్యచంద్రారెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి తరుణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, విజయరెడ్డి, కొండారెడ్డి, నిట్టూరి సుబాన్, కరెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ జనార్ధన్










