ప్రజాశక్తి-అనంతపురం సిటీ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌కెయు విసి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఎస్‌కెయూ మెయిన్ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే తోపుదుర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, వైఎస్‌ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల ద్వారా నైపుణ్యం పెరగడంతోపాటు మచి స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. అందుకోసమే జిల్లాకు ఎంతో కృషి చేసిన ఫాదర్‌ఫెర్రర్, రాష్ట్రానికి దేశంలోనే పేరు తీసుకొచ్చిన వైఎస్‌ఆర్ పేరుమీద క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆకుతోటపల్లి - చిన్నంపల్లి జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్‌ను ఎస్పీ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మండల కన్వీనర్లు, ఎంపిపి, జడ్పీటీసీ, వైస్ ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచులు, అనంతపురం రూరల్ మండలం అగ్రీ అడ్వజరీ బోర్డు ఛైర్మన్ ఆలమూరు సుబ్బారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి










