ప్రజాశక్తి-అనంతపురం విద్యార్థులకు క్రీడలు ద్వారా మానసిక వికాసంతోపాటు టీమ్ వర్క్ పెంపొందుతుందని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. మంగళవారం స్థానిక జెఎన్‌టియు క్రీడా మైదానంలో ఇంజినీరింగ్ కళాశాల-2023 వార్షిక ఆథ్లెటెక్ మీట్‌లో భాగంగా టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను విసి ప్రారంభించారు. ముందుగా విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. తర్వాత ప్రిన్సిపాల్ పి.సుజాత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విసి మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల చురగ్గా ఉంటుందన్నారు. ముఖ్యంగా సోషియల్, కమ్యునికేషన్స్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం రన్నింగ్, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ వంటి పోటీలను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జెఎన్‌టియు రెక్టార్ విజయకుమార్, రిజిస్టార్ సి.శశిధర్, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భవానీ, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న జెఎన్‌టియు విసి, అధికారులు










