ప్రజాశక్తి తిరుపతి సిటీ
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం స్టేడియంలో మంగళవారం ఉదయం ఆయన ఎస్వీబిసి ఉద్యోగుల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీబిసి ఛైర్మన్ మాట్లాడుతూ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను రూపొందించడంలో ఉద్యోగుల కషి ఎంతో ఉందని కొనియాడారు. నిత్యం పని ఒత్తిడితో అలసిన ఉద్యోగులకు క్రీడా పోటీలు ఆట విడుపు కావాలన్నారు. ఉద్యోగులు అందరూ క్రీడా పోటీల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలన్నారు. అనంతరం ఎస్వీబిసి కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎస్వీబిసి ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ అభివద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. సమాజ వికాసానికి ఆర్థిక స్వావలంబనకు మహిళలు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఈవో సురేష్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.










