Aug 13,2023 21:32

జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సెపక్‌తక్రా క్రీడాసంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జునఔ

       ప్రజాశక్తి-ఉరవకొండ   క్రీడాకారులు గెలుపోట ములను సమానంగా తీసుకోవాలని సెపక్‌తక్రా క్రీడాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున పిలుపు నిచ్చారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ సెంట్రల్‌ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయులు దావూద్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సెపక్‌తక్రా క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకం ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా ఈ పోటీల్లో 16 బాల బాలికల క్రీడా జట్లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా బాలుర విభాగంలో ఉరవకొండ మహేశ్వరి ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు విన్నర్స్‌గా నిలిచారు ఉరవకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రన్నర్స్‌ గా నిలిచారు. తతీయ స్థానంలో బ్రహ్మసముద్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. అదేవిధంగా బాలికల విభాగంలో కరూర్‌ మండల పరిధిలోని తట్రకల్లులో ఉన్న కేజీబీవీ బాలికల పాఠశాల విద్యార్థులు ప్రస్తుతం స్థానం, ఉరవకొండ మండల పరిధిలోని ఆమిదాల ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులు ద్వితీయ స్థానం ఉరవకొండలోనే మహేశ్వరి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఉరవకొండ ప్రభుత్వ సెంట్రల్‌ హైస్కూల్లో జరిగిన జిల్లాస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెపక్‌తక్రా క్రీడాకారుల సంఘం షాహిన్‌, మారుతీప్రసాద్‌, ఆయా పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.