Dec 07,2022 22:55

బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులతో నగర కమిషనర్‌ అరుణ

క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం మెకానిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ అండర్‌ -19 బాస్కెట్‌బాల్‌ బాల,బాలికల జట్లకు క్రీడాకిట్లను అందించారు. కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములతో పనిలేకుండా ఉన్నతమైన లక్ష్యం కోసం శ్రమించాలన్నారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు చంగల్రాయ నాయుడు, సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, కోచ్‌ ఉదరు భాస్కర్‌, సురేష్‌కుమార్‌, ఎన్‌పి.జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులతో నగర కమిషనర్‌ అరుణ