ప్రజాశక్తి-ఉలవపాడు :మండలంలోని కరేడు పివిఎస్ ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ -19 బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాసులు తెలిపారు. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే స్కూల్ గేమ్స్ -అండర్ 19 బాలికల రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎనిమిది మంది ఎంపికయ్యారు. వీరిని గురువారం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీధర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసులు , ఇంచార్జ్ ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు స్టాఫ్ సెక్రటరీ కే. కష్ణ, ఉపాధ్యాయ సిబ్బంది, స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆదినారాయణ, గ్రామస్తులు అభినందించారు. ప్రకాశం జిల్లా బాలికల జట్టుకు రూ 4000 విలువ గల క్రీడా దుస్తులు బహుకరించిన డేగల కాశి బాబు (హైదరాబాద్)కు కతజ్ఞతలు తెలిపారు.










