Oct 14,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రంలో ప్రజలు విద్యుత్‌ బిల్లులు ముట్టుకుంటే షాక్‌ కోట్టే పరిస్థితి వచ్చిందని, పెంచిన కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాల ఆద్వర్యంలో శనివారం కావలి బ్రిడ్జి సెంటర్‌ నుండి కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్మోహన్‌ రెడ్డి చేతగానితనం, స్వార్థ ప్రయోజనాలతో విద్యుత్‌ రంగం కుదేలు అయిందన్నారు. తమది పేదల ప్రభుత్వం, పెత్తందారులపై తమ పోరాటం అని చెబుతూ ప్రజలపై భారాలు వేస్తున్న వైసిపి ప్రభుత్వన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం అసన్నమైందన్నారు. కేంద్రం అదేశాల మేరకు విద్యుత్‌ సంస్కరణల పేరుతో రాష్ట్రం ప్రభుత్వం ''ఫిక్సిడ్‌ ట్రూ అప్‌ కస్టమర్‌ ఛార్జీల పేరు''తో విద్యుత్‌ వినియోగదారులపై అధిక భారం మెపుతుందన్నారు. ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో ఇప్పుడు వసూళ్లు చేయడం సమంజసం కాదన్నారు.
విద్యుత్‌ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని, కరెంట్‌ ఛార్జీలు తగ్గించాల్సింది పోయి అదనపు ఛార్జీలు వసూళ్లు చేయడం దారుణమన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కరెంట్‌ ఛార్జీలు పేరుతో ప్రజలపై భారం మోపిందని, సర్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలను వేంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పసుపులేటి పెంచలయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె.నాగరాజు, రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా దమ్ము దర్గాబాబు, సిపిఐ న్యూడెమోక్రసి కార్యదర్శి కరవది భాస్కర్‌, సిపిఐ మంఎల్‌ లక్మిరెడ్డి, స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు ఎల్‌.శ్యామల నరసింహారావు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.