ప్రజాశక్తి - మొగల్తూరు
కొవ్వలి ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయమని టిడిపి మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు అన్నారు. ఆదివారం రామన్నపాలెంలోని పిట్టావారి పేటకు చెందిన మోటూరి రవి కుమార్‌కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.50 వేల విలువైన ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్‌ను ఫౌండేషన్ కార్యదర్శి కొండా జయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. కొవ్వలి ఫౌండేషన్ ఛైర్మన్ కొవ్వలి రామ్మోహన్ నాయుడు ప్రజలకు మరెన్నో సేవలు చేయాలన్నారు. భవిష్యత్తులో కూడా రామ్మోహన్ నాయుడు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకన సుబ్రహ్మణ్యం, అడ్డాల బాబ్జీ, బళ్ల శ్రీను, బిపిఎస్‌వి సత్యనారాయణ, గుబ్బల జగన్నాధం, కుక్కల చిట్టిబాబు, కట్టా నాగుర్ పాల్గొన్నారు.










