Sep 26,2023 00:13

కోలా శాంతి లతకు ఘన సన్మానం

కోలా శాంతి లతకు ఘన సన్మానం

ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని గంగినాయనపల్లి గ్రామ పంచాయతీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోలా శాంతిలను సోమవారం ఎంఈఓ సాయిలీల, ఎంఈవో-2 సుబ్రహ్మణం ఘనంగా సన్మానించారు. శాంతిలత పదవీ విరమణ సందర్భంగా స్థానిక రాయల్‌ మహల్‌లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ ప్రధానో పాధ్యాయురాలికి శాంతి లత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పి మెరుగైన భవిష్యత్‌ తరాన్ని తయారు చేశారని కొనియాడారు. అనంతరం శాంతి లత దంపతులకు శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.