Oct 06,2023 21:12

ఫొటో : దీక్షలు చేపడుతున్న టిడిపి, సిపిఐ నాయకులు

కొనసాగుతున్న టిడిపి రిలే దీక్షలు
ప్రజాశక్తి-కావలి : మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద పార్టీ కుటుంబ సభ్యులతోశుక్రవారం రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మాట్లాడుతూ ఈరోజుటికీ చంద్రబాబు నాయుడును 28 రోజులుగా జైలులో ఉంచారని, కనీసం ఆయనకు జైలులో మంచి వసతులు కూడా కల్పించకుండా కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇటువంటి కక్ష సాధింపు సిఎంను రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు చూడలేదని, ఇకపై చూడబోరని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.
పేద ప్రజలను అంథకారంలోకి నెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ వైసిపి ప్రభుత్వమని ద్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో టిడిపిని అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జ్యోతి బాబురావు, బొట్లగుంట శ్రీహరి నాయుడు, గొట్టిపాటి రాము, మక్కి శ్రీహరి, ఆవుల రామకృష్ణ, పోతుగంటి శ్రీకాంత్‌, పల్లపుకుమార్‌, దావులూరు దేవకుమార్‌, మస్తాన్‌, రఫీ, సిపిఐ నాయకులు దర్గాబాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.