ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరు నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన దీక్షల్లో మాదిగ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీక్ష ముగింపు సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో అభివద్ధి, సంక్షేమాల పాలనకు స్వర్గీయ నందమూరి తారకరామారావు బీజం వేశారని, తర్వాత చంద్రబాబు నాయుడు ఆ వారసత్వాన్ని కొనసాగించారన్నారు. మాదిగల కోసం ప్రత్యేకంగా కాలనీల నిర్మాణం, బలహీన వర్గాల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, భూముల పంపిణీ, మహిళలకు సమాన హక్కులు లాంటి అనేక పథకాలను ఎన్టీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ క్రిస్టియన్స్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, వలేటివారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గురజాల బెంజిమెన్ , నెల్లూరు పార్లమెంటు ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అక్కిలిగుంట ప్రకాశం , నెల్లూరు పార్లమెంటు ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి అంగు లూరి చినకొండయ్య , కందుకూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి దువ్వూరి రమేష్ చంద్ర , ఉచ్చులూరి సుకుమార్ , పూండ్ల పెంచలయ్య , ఉలవపాడు మండల ఎస్సీ అధ్యక్షులు రావినూతల రమేష్ , జాన్ వెస్లీ, లింగసముద్రం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్లూరి ముసలయ్య నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, చిలకపాటి మధుబాబు, ముచ్చు వేణు, షేక్ సలాం ఉన్నారు.










