ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరులోని టిడిపి కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 27వ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న కందుకూరు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటిపాలన నడుస్తోందని, సైకో పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నాయకులు కండ్రా మాల్యాద్రి, నాదెళ్ల వెంకట సుబ్బారావు, చిలకపాటి మధుబాబు, గోచిపాతల మోషే, బెజవాడ ప్రసాద్, తల్లనేని సుబ్బారావు, సుదర్శి శ్రీనివాసులు, దివి మాధవరావు, రావుల రవి, లక్కంరాజు నరేష్, నాగరాజు, చుండూరి శ్రీను, షేక్ సలాం, షేక్ ఫిరోజ్, షేక్ షరీఫ్, మాదాల రవి, దువ్వూరి రమేష్, లింగాబత్తిన మాల్యాద్రి ఉన్నారు.










