ప్రజాశక్తి-కందుకూరు :చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న 28 రోజుల నుంచి ప్రతి నిమిషం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కందుకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 25వ రోజుకు చేరాయి. దీక్ష ముగింపు సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ. 3 వేలు కోట్ల అవినీతి జరిగిందని మొదట చెప్పిన వైసీపీ నేతలు, తర్వాత 370 కోట్లు అని, ప్రస్తుతం 27 కోట్లు అని రోజుకో మాట మారుస్తున్నారన్నారు. మరోవైపు సైకో చెప్పిందల్లా చేయాల్సి వస్తుందంటూ పోలీసులు లోలోపల మదన పడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, నాయకులు ఘట్టమనేని చెంచురామయ్య, నాదెళ్ల వెంకట సుబ్బారావు, చిలకపాటి మధు, గోచిపాతల మోషే, రెబ్బవరపు మాల్యాద్రి, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, బెల్లం కష్ణమోహన్, అమరనేని రాములు, షేక్ సలాం, గుత్తా మాలకొండయ్య, పిల్లిమిట్ల ప్రసాద్, తిరుమలరావు, చిత్తారి శ్రీనివాసులు ఉన్నారు.










