Oct 28,2023 22:06

ఫొటో : నిరసన ధర్నా చేపడుత్ను హమాలీలు

కొనసాగుతున్న హమాలీల నిరసన ధర్నా
ప్రజాశక్తి కోవూరు : ఇనమడుగు సెంటర్‌ హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళన మూడో రోజు శనివారం యథాప్రకారం ఇనమడుగు రోడ్డులోని బాలాజీ వేర్‌ హౌసింగ్‌ గోదాముల ఎదుట కొనసాగింది. డివైఎఫ్‌ఐ నెల్లూరు నగర కార్యదర్శి నరసింహ, లారీ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి దామోదర్‌ రెడ్డి మాట్లాడుతూ అన్ని గోదాములలో ఇస్తున్న కూలి ఇవ్వమని అడిగిన న్యాయమైన సమస్యను యాజమాన్యం కాలయాపన చేయడం సరైన కాదన్నారు. హమాలీ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు.
సామరస్యంగా సమస్య పరిష్కరానికి కార్మికులు ప్రయత్నిస్తుంటే యాజమాన్యం సమస్య జఠిలం చేసే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారుల జోక్యం చేసుకోకపోతే రోజురోజుకి ఆందోళన తీవ్రతరం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కోవూరు మండల కార్యదర్శి గండవరపు శేషయ్య, సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, ఆవాజ్‌ నాయకులు చాన్‌బాషా, డివైఎఫ్‌ఐ నాయకులు జగదీష్‌, ఇనమడుగు సెంటర్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.