Jul 21,2023 20:59

ప్రజాశక్తి - మొగల్తూరు
విఆర్‌ఎల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మొగల్తూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద విఆర్‌ఎల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండో రోజు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో విఆర్‌ఎలు మోకాళ్లపై నిల్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కోటిపల్లి వేణు, చంటి బాబు, గణేష్‌, కృష్ణ, సత్యనారాయణ, శ్రీను, ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఆచంట : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన నిరసన రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు తలుపురి ముత్యాలరావు మాట్లాడుతూ విఆర్‌ఎలకు ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు, నాయకులు సిర్రా నరసింహమూర్తి, ఎస్‌విఎన్‌.శర్మ, పి.మోహన్‌రావు, వద్దిపర్తి శ్రీనివాస్‌, విఆర్‌ఎలు సాయిరాం, ముత్యాలరావు, సత్యనారాయణ, భుజింగరావు పాల్గొన్నారు.
పోడూరు : విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం అధ్యక్షులు బెల్లాన్ని ప్రకాశరావు, కార్యదర్శి కడిమి ఏసు, కోశాధికారి నల్లి సుమన్‌, ఉపాధ్యక్షులు కంతేటి సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఉండి : ఉండిలో రెండో రోజు శుక్రవారం విఆర్‌ఎలు నిరసన దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. విఆర్‌ఎలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్‌, రామకూరి వెంకటరత్నం, విఆర్‌ఎలు పిల్లి సుబ్బారావు, ముత్యాలపల్లి నాగరాజు, బాబ్జి, యేసు రత్నం, కొడవర్తి శ్రీను, సయ్యద్‌ హజార్‌ మొహిద్దిన్‌, రాజగోపాలం, నల్లబ్బాయి పాల్గొన్నారు.
పాలకొల్లు : విఆర్‌ఎలకు పేస్కేలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా శుక్రవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎ సంఘం మండల అధ్యక్షులు రాపాక నరేష్‌, సెక్రటరీ తంగెళ్ల గోవింద్‌, ట్రెజరర్‌ తాడిపర్తి వెంకటేశ్వరరావు, మర్రే వరప్రసాద్‌, దేవరకొండ నాగేశ్వరరావు, శివకుమార్‌, ఏసోబు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు రెండో రోజు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం మండలాధ్యక్షుడు మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు రాపాక ప్రసాద్‌, ట్రెజరీ కొత్తపల్లి సుబ్బారావు, నాగులు పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : జగన్మోహన్‌రెడ్డి విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ విమర్శించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో విఆర్‌ఎల సమస్యలపై నిరసన దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.బలరాం, కె.భ్రమ్మయ్య, కె.పోసిబాబు, వినయవతి, విశ్రాంతి, ఎం.జ్యోతి, ధర్మారావు, టి.సత్యనారాయణ పాల్గొన్నారు.
విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు విచ్చేసిన నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజకు, తహశీల్దార్‌ పిఎన్‌డి ప్రసాద్‌కు విఆర్‌ఎలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమవరం డివిజన్‌ అధ్యక్షులు పండు మాట్లాడారు. వెంటనే విఆర్‌ఎ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎలు పాల్గొన్నారు.
పెనుగొండ : విఆర్‌ఎలకు కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విఆర్‌ఎలు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ ఎన్‌.గురుమూర్తి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు నాగేశ్వరరావు, షేక్‌ పాదుషా, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు బుంగా గణేష్‌, వి.పాపారావు, బొక్క దుర్గాప్రసాద్‌, కె.వెంకట్రావు, జి.రవికుమార్‌ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షుడు గుమ్మళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పెంటపాటి నరసింహమూర్తి, కార్యదర్శి మాగపాటి నరసయ్య, సభ్యులు ఆట్రగడ్డ వెంకట తాతారావు, మీనారాణి, షేక్‌ మస్తాన్‌ బీబీ పాల్గొన్నారు.
యలమంచిలి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు చేపట్టిన నిరసన దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు సిఐటియు మండల కార్యదర్శి దేవ సుధాకర్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు పాల్గొన్నారు.