ప్రజాశక్తి - నరసాపురం టౌన్
నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా 13వ వార్డు కౌన్సిలర్ తోట అరుణకుమారి మాట్లాడారు. విద్యార్థులు మంచి పుస్తకాలు చదవాలన్నారు. అనంతరం పిల్లలకు స్నాక్స్ పంపిణీ చేశారు. అలాగే పుస్తక పఠనం, పుస్తక సమీక్ష నిర్వహించారు. తరువాత పిల్లలకు కథలు చెప్పారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వివిఎస్.నాయుడు పిల్లలకు కంప్యూటర్ గురించి వివరించారు. కార్యక్రమంలో తోట సురేష్, రేవంత్, సూర్యం బాబు, సుధీర్ మోహన్ పాల్గొన్నారు.










