ప్రజాశక్తి - భీమవరం
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రవీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని భీమవరం కలెక్టరేట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భీమవరం కలెక్టరేట్ ఉద్యోగులు చేపట్టిన నిరసన 26వ రోజు సోమవారం కూడా కొనసాగింది. దీనిలో భాగంగా ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటలకు విధులు ముగించుకుని కలెక్టరేట్ ఎదురుగా నిరసన తెలిపారు. సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డిఎ బకాయిలు మంజూరు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి వై.దుర్గాకిశోర్, సూపరింటెండెంట్ ఎస్.సుబ్రహ్మణ్యం, సిహెచ్.రవికుమార్, నిజాముద్దీన్‌షా, సీనియర్ సహాయకులు వివి.పెద్దిరాజు, పి.జగన్మోహన్ పాల్గొన్నారు.










