Mar 26,2023 20:55

ప్రజాశక్తి - భీమవరం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5న కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారయాత్ర ఆదివారం భీమవరం చేరుకుంది. ప్రకాశంచౌక్‌, ఇతర ప్రాంతాల్లో జరిగిన సభల్లో సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలురైతు సంఘం జిల్లా నాయకులు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి రైతులను భూములకు దూరం చేసే చట్టాలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. సాధారణ ప్రజలపై భారాలు మోపుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కక్షపూరిత పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టి పోలవరానికి నిధులివ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు ఎం.ఆంజనేయులు, డి.నాగు, ఎన్‌.రాజు, షేక్‌ వలీ, పోతు శ్రీను పాల్గొన్నారు.
ఉండి: చలో ఢిల్లీని విజయవంతం చేయాలని చేపట్టిన ప్రచార జాతా ఆదివారం ఉండి మెయిన్‌ సెంటర్‌కు చేరుకుంది. ఈ ప్రచార జాతకు ప్రజాసంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జాతా నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు, పోతు శ్రీను, స్థానిక నేతలు ధనికొండ శ్రీనివాస్‌, కాటా నరేష్‌, దేవల శివ గణేష్‌, కొట్టాడ వెంకటేశ్వరరావు, మోపిదేవి రాము పాల్గొన్నారు.
కాళ్ల: చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదంచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జీపు యాత్ర జువ్వలపాలెం, కాళ్లకూరు, కాళ్ల, సీసలి, పెదఅమిరం గ్రామాల మీదుగా సాగింది. కాళ్లలో బస్టాండ్‌ సెంటర్లో నిర్వహించిన సభలో నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు ఆకుల హరేరామ్‌, మామిడిశెట్టి రామాంజనేయులు, మండా సూరిబాబు, తిరుమాని శ్రీను, వెంకటేశ్వరరావు, కొండరాజు పాల్గొన్నారు.
ఆకివీడు: చలో ఢిల్లీ ప్రచార యాత్ర ఆదివారం ఆకివీడు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. మాట్లాడారు. కార్యక్రమంలో జాతా నేతలతోపాటు స్థానిక నాయకులు నెల్లి సూరిబాబు, రంగా, గౌరినాయుడు, రామకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.
మొగల్తూరు : చలో ఢిల్లీ ప్రచార యాత్ర ఆదివారం సాయంత్రం మొగల్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీబొమ్మల సెంటర్‌లో జాతా నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, ఎం.ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు యడ్ల చిట్టిబాబు, ఆదూరి సాంబమూర్తి, కొత్తపల్లి నాగరాజు, వీర పాండురంగారావు పాల్గొన్నారు.