Mar 25,2023 22:23

ప్రజాశక్తి - ఆచంట
          కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. చలో ఢిల్లీ జీపు ప్రచార జాతా స్థానిక కచేరీ సెంటర్‌కు శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా చల్లో ఢిల్లీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌, ఉపాధ్యక్షులు ఇందుకూరి సూర్యనారాయణరాజు, ఎపి కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు పాల్గొన్నారు.
గణపవరం: పిప్పరలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలోఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడతా ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌, నేతలు గుత్తుల శ్రీను పి.గోవింద్‌, కె.సోమరాజు, కౌరు పెద్దిరాజు మామిడిశెట్టి రామాంజనేయులు, పెచ్చెట్టి నరసింహమూర్తి పాల్గొన్నారు.
తణుకురూరల్‌: చలో ఢిల్లీ జీపు ప్రచార జాతా పట్టణంలో కప్పల వెంకన్న సెంటర్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా జాతా నేతలు పివి.ప్రతాప్‌, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పి.దక్షిణామూర్తి, గుబ్బల గోపి, షేక్‌ వలీ తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ: చలో ఢిల్లీ ప్రచార జాతా రాక సందర్భంగా స్థానిక గోంగూర తూము సెంటర్లో సభ నిర్వహించారు. సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌, కౌలురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేతా గోపాలన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, రైతుసంఘం నాయకులు ఇందుకూరి సూర్యనారాయణరాజు, బొర్రా ధర్మారావు, ఎస్‌.వెంకటేశ్వరరావు, మాదాసు నాగేశ్వరరావు, ఆవుల శ్రీనివాసరావు, షేక్‌ పాదుషా, కె.తులసి, గెద్దాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పెనుమంట్ర: మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్‌ 5న ఢిల్లీలో చేపట్టే కార్మిక, కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొనాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరామ్‌ డిమాండ్‌ చేశారు. చలో ఢిల్లీ ప్రచార జాతా శనివారం మార్టేరు మీదుగా పెనుమంట్ర చేరుకుంది. ఈ సందర్భంగా 'మోడీ దొంగల బండి.. యమజోరుగా ఉందండి' అంటూ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి షేక్‌ వలీ పాట స్థానికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాతా నేత జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కూసంపూడి సుబ్బరాజు, వివిధ సంఘాల నేతలు కోడే శ్రీనివాస్‌ప్రసాద్‌, వాకపల్లి వెంకటరత్నం (గాంధీ), పోతు శ్రీను, దిద్దే వెంకట్రావు, చింతపల్లి లక్ష్మికుమారి, వెంకటరాజు పాల్గొన్నారు.