Mar 08,2022 21:31

మాట్లాడుతున్న సముద్రాల లక్ష్మణయ్య


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొల్హాపురి శ్రీ మహాలక్ష్మి చరిత్ర పుస్తక విశ్లేషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ '' సమబుద్దె అందరికి సర్వ వేధాల సారము'' అని అన్నమయ్య తెలిపారన్నారు. ప్రముఖ అవధాని డాక్టర్‌ మెడసాని మోహన్‌ మాట్లాడుతూ జానపదాల్లోని కొన్ని అంశాలను గ్రంధ రూపంలో సమాజానికి అందిచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కొల్హాపురి శ్రీ మహాలక్ష్మి చరిత్ర గ్రంధ రచయిత యబ్బిలి వెంకట్రామయ్య ఎన్నొ ముఖ్యమైన అంశాలను ఈ పుస్తకం ద్వారా తీసుకోచ్చారని, ఇది అందరికి ప్రేరణ అవుతుందన్నారు. ఏకలవ్యుని కథ, శ్రీ మహాలక్ష్మికి ఎరుకుల వారి సహాయ ఘట్టాలను పుస్తకం ద్వారా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో చంధ్రశేఖర భాగవతార్‌, ఆదిత్య శర్మ పాల్గొన్నారు.