ప్రజాశక్తి - ఆచంట
ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సభ్యురాలిగా నియమితులైన కొడ మంచిలి పెదపేటకు చెందిన జిల్లెళ్ల సత్యసుధామను ఆచంట మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ సుంకర ఇందిరా సీతారామ్ ఆధ్వర్యంలో కొడమంచిలి పెదపేట పరిశుద్ధ పేతురు లూధరన్ దేవాలయం ఆవరణలో ఆదివారం సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లెళ్ల సత్యసుధామ మాట్లా డుతూ పుట్టిన ఊరిలో గ్రామస్తులంతా గుర్తుపెట్టుకుని సన్మానించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఎస్‌సి ఎస్‌టి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. దళిత యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరారు. కమిటీ సభ్యురాలిగా అవకాశం కల్పించిన కలెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వ హించి, దళితుల సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆమె పెదపేటకు చెందిన ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆచంట మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, సంఘ పెద్దలు యల్లమెల్లి నాగేశ్వరరావు, మానుకొండ ఏసు, పుచ్చకాయల రమేష్, కోట సతీష్, కుసుమ ధర్మంగాధరావు, నిమ్మితి వేణుబాబు, చెల్లా సుభాకార్, కొట బాబురావు, కోటే శశి మధు, స్త్రీల సమాజం సభ్యులు కేతా సత్యాకుమారి, యూత్ నాయకులు పాల్గున్నారు.










