Apr 03,2023 16:14

ప్రజాశక్తి-గణపవరం : గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అర్థవరంలో సోమవారం స్థానిక సచివాలయం వద్ద కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా 65 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 65 మందికి కళ్ళజోళ్ళు పడతాయని కంటి వైద్యులు ఐ శ్రీనివాసు చెప్పారు. కళ్ళజోళ్ళు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందని చెప్పారు. అనంతరం పారిశుద్య నిర్మూలనపై స్తానికులకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పీ.సంతోషనాయుడు మాట్లాడుతూ వారానికోసారి ప్రైడే-డ్రైడే పాటించి దోమలు నివారనకు కృషి చేయాలని అన్నారు మంచినీటి ట్యాంకులను పంచాయతీ సిబ్బంది వారానికోసారి శుబ్రంచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో సిఎచ్చ్ ఓజాలాది విల్సన్ బాబు, వైద్యసిబంది లక్షికాంతం, బి.రవికుమార్, ఎం సంపూర్ణ.గ్రామసర్పంచిగా తల సుజాత, కార్యదర్సి జే.రామక్రిష్ణుడు పాల్గొన్నారు.