- తొలి తెలుగు నాటక కర్త కందుకూరి..కత్తుల రామ్మోహన్ రావు.
ప్రజాశక్తి-పాలకొల్లు : నటీనట సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవం సమాఖ్య అధ్యక్షుడు కత్తుల రామమోహన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడాల హరిబాబు అతిథులకు స్వాగతం పలికారు. తొలి తెలుగు నాటకరంగ రూపశిల్పి కందుకూరి వీరేశలింగం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామమోహన్ మాట్లాడుతూ తొలి తెలుగు నాటకం ,"వ్యవహార ధర్మభో దిని" ప్రదర్శనకు (1880) ఆద్యుడు వీరేశలింగం అని, తెలుగు నాటకరంగానికి ఆయన పితామహుడు అని చెప్పారు. వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం ఏప్రిల్ 16ని "తెలుగు నాటక రంగ దినోత్సవంగా" 2007లో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అని చెప్పారు. ఆనాటి నుంచి తెలుగు ప్రజలు, కళాకారులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కళా కారుడు శివాల రామారావును ఘనంగా సత్కారం చేశారు. విశ్రాంత కళాశాల ప్రిన్సిపాల్ చేగొండి సత్యనారాయణ మూర్తి తెలుగు నాటకరంగం నాడు - నేడు, ఎలా ఉందో చక్కగా వివరించారు.ఉన్నమట్ల కపర్ది, రాజా తాతయ్య, కొల్లు నర సింహామూర్తి, సారిక రామ చంద్రరావు, పుత్సల నాగలింగేశ్వరరావు, జాగు సత్యనారాయణ, పఠాన్ ఖలేశావలి, మామిడి శెట్టి శ్రీనివాస్, కోలాటి పెడ్డిరాజు.జీ.యస్.యన్.రవి.మాదిరెడ్డి శ్రీనివాస్ , అంబటి రాజు మాట్లాడారు.










